Tuesday, November 19, 2024

AP – శాంతించని బుడమేరు… ఏలూరు – కైకలూరు మధ్య రాకపోకలు బంద్

విజయవాడ బుడమేరు శాంతించే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడం లేదు. వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. నందివాడ మండలంలోని 12 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జాతీయ రహదారిపై రెండు నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది.

కొల్లేరులో భారీగా వరద నీరు చేరడం తో ఏలూరు-కైకలూరు మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచి పోయాయి .. భారీ వాహనాలను కూడా పోలీసులు అనుమతించడం లేదు

కాగా. కొల్లేరు వరద నీటిలోనే పలు కుటుంబాలు కాలం గడివుతున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలకు పడవల ద్వారానే ఆహారం… ఇతర సహాయ కార్యక్రమాలను అధికారులు అందిస్తున్నారు. ఇక వినాయక చవితి పండుగకు బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు దూరమయ్యాయి

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement