కర్నూలు బ్యూరో – సెల్‌ఫోన్‌తో ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు సాంబార్ గిన్నెలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలో చోటుచేస్తుంది.
వివరాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి. గోనెగండ్ల లో శుక్రవారం ఓ ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈ శుభకార్యానికి గద్వాల జిల్లా, వడ్డేపల్లి మండలం పైపాడుకు చెందిన వీరేశ్ తన కుటుంబంతో కలిసి వెళ్లాడు. కాగావీరేశ్ కుమారుడు జగదీశ్ (6) సెల్ ఫోన్ తో ఆడుకుంటూ అక్కడే ఉన్న సాంబార్ గిన్నెపై కూర్చున్నాడు.
అయితే ప్రమాదవశాత్తు సాంబార్ గిన్నె మూత జారిపోవడంతో అందులో పడిపోయాడు. బాలుడి కేకలు విన్న తల్లిదండ్రులు వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అక్కడి వైద్యుల సూచనతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. పొరుగున ఉన్న తెలంగాణ నుంచి కర్నూలు జిల్లాకి వలస వచ్చి శుభకార్యముకు వెళ్లి.. కొడుకును పోగొట్టుకోవడంతో బాలుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.