ఢిల్లీ – ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితురాలైన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు.. ఆమెను ఎంపిక చేసిన సమయంలో పురందేశ్వరీ తీర్ధయాత్రలలో ఉన్నారు.. నేడు ఢిల్లీకి చేరుకున్న ఆమె ఏపీ స్టేట్ చీఫ్గా నియమితులైన తర్వాత తొలిసారిగా ఆయనతో ఈ రోజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియపారు.. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో తెలిపారు
‘‘నడ్డాను కలిశాను. నాపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాను. నాకిచ్చిన బాధ్యత విషయంలో నిబద్ధతతో పని చేస్తానని మాటిచ్చాను” అని పురందేశ్వరి ట్వీట్ చేశారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ఏపీ, ఆంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు కూడా కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు.. అందరిని కలుపుకుని బిజెపిని ఎపిలో బలోపేతం చేస్తానని చెప్పారు.