ఇటీవల కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లా వణికిపోయిన సంగతి తెలిసందే. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు భారీ వర్షాలు, వదరలతో అతలాకుతలమైయ్యాయి. వరదల బీభత్సంతో రాయలసీమ జిల్లాలో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆయా జిల్లాల ప్రజలు నేటికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత జిల్లాల్లో బాధితులను ఆదుకునేందుకు ఏపీ బీజేపీ ప్రత్యేక కార్యక్రమానికి సిద్ధమైంది.
వరద బాధితులను ఆదుకునేందుకు ఈనెల 25, 26 తేదీల్లో జోలె పట్టి నిధులు సేకరించాలని నిర్ణయించింది. వాటిని బాధితులకు పంపిణీ చేయన్నారు. పార్టీ శ్రేణులకు ఉన్న సేవా దృక్పథంతో ప్రజల్లోకి వెళ్లి జోలె పట్టి వస్తు, నగదు రూపంలో నిధులు సేకరించాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. బాధితులకు పంపిణీ చేసి అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..