Tuesday, November 19, 2024

AP – పవన్ కళ్యాణ్ కు బిగ్ రిలీఫ్

అమరావతి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కు బిగ్‌ రిలీఫ్‌ దక్కింది. క్రిమినల్ కేసు ఎత్తివేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు తొలగించారు.

ఈ మేరకు ఆయన పై ఉన్న క్రిమినల్ కేసును తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆర్.శరత్ బాబు.

వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని పవన్ కళ్యాణ్‌ ఆరోపించారంటూ 2023, జులై 29న గుంటూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదు చేసారు.. దీనిపై కేసు నమోదు చేశారు.దీనిపై గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు పవన్ .. తాజా విచారణలో తాము ఫిర్యాదు చేయలేదన్న వాలంటీర్లు కేసును ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు న్యాయమూర్తి..

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కు బిగ్‌ రిలీఫ్‌ దక్కింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement