Saturday, September 21, 2024

Undavalli: ఏపీ విభజనపై పార్లమెంట్ లో చర్చ జరగాలి

రాష్ట్ర విభజన సక్రమంగా జరగలేదంటూ పార్లమెంట్ లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఏపీ నేతలు సైతం ఇప్పుడు స్పందిస్తున్నారు. ఏపీ విభజన తీరుపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. విభజన వేళ ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్‌లో రాష్ట్ర పార్టీలు గళమెత్తాలి అని అన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై చర్చకు కోరాలన్నారు. చర్చ జరిగితే అన్యాయం దేశానికి తెలుస్తుందని తెలిపారు. అన్యాయం చేసిన వాళ్లే అన్యాయం జరిగిందంటున్నారని మండిపడ్డారు. అన్యాయంపై అడగటానికి రాష్ట్ర పార్టీలకు భయమెందుకు? అని ప్రశ్నించారు. మౌనంగా ఉంటే ముందు తరాలు దారుణంగా నష్టపోతాయని హెచ్చరించారు. ఆంధ్రాకు ఏం చేసినా అడిగేవాడు లేడని అనుకుంటారని అన్నారు. సీఎం జగన్‌ సమర్థవంతమైన వ్యాపారవేత్త అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడం లేదని ఉండవల్లి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement