Friday, November 22, 2024

ఇంధ‌న పోదుపులో ఏపీ భేష్‌.. టాప్‌ 10 రాష్ట్రాల్లో చోటు..

విశాఖపట్నం (ప్రభన్యూస్‌ బ్యూరో): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇంధ‌న‌ పొదుపులో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోందని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్‌ వేదికగా ఆయ‌న పలు అంశాలు వెల్లడించారు. ఇంధ‌న సామ‌ర్థ్యం మెరుగుపరిచే కార్యక్రమాలు సమర్దవంతంగా అమలు చేయడం ద్వారా ఏపీ దేశంలోనే టాప్‌ -టెన్‌ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందన్నారు.

ఈ మేరకు బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ డైరెక్టర్‌ వినీత కన్వాల్‌ ఇటీవల సిఐఐ నిర్వహించిన సదస్సులో ఈ విషయం ప్రకటించారన్నారు. నేలపై ఉండి ఆకాశమంత ఎత్తు ఎదిగిన వ్యక్తి దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని ఆయన ప్రవేశ పెట్టిన విప్లవాత్మక పథకాలు జనరంజక పాలనకు సాక్ష్యాలుగా నిలిచాయని అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం మెదలగు రంగాల్లో తన మార్కును ప్రదర్శించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్‌ఆర్‌ పేరుమీద పురష్కారాలు ప్రధానం చేయడం సంతోషకరమన్నారు.

నీతి అయోగ్‌, ప్రపంచ బ్యాంకు సంయుక్త చొరవతో దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం మరింతగా పెరగనుందన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల ఫైనాన్సింగ్‌ వేగవంతం, సులభతరం చేసి బ్యాంకులకు ప్రోత్సహించడం ద్వారా బ్యాంకులు ఎలక్ట్రిక్‌ వాహనాల ఫైనాన్సింగ్‌ పెద్ద ఎత్తున చేపడతాయన్నారు. ఈ చొరవతో ఎలక్ట్రిక్‌ వాహనాల ఫైనాన్సింగ్‌ ఖర్చు 10 నుండి 12శాతం తగ్గే అవకాశం ఉందని అన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల నివియోగం పెరిగి, పర్యావరణ హిత రవాణా సాధ్యపడుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement