Saturday, January 4, 2025

AP – మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్లుగా ఎంపీలు కేశినాని చిన్ని, బాల శౌరి

మంగళగిరి – ఆంధ్రప్రభ: మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ పాల‌క‌ మండ‌లి స‌భ్యులుగా విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ , మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎన్నికయ్యారు. లోక్‌స‌భ కోటా నుంచి మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ పాల‌క‌మండ‌లి స‌భ్యులుగా ఎకగీవ్రంగా ఎన్నికయ్యారు. అధికారికంగా లోక్‌స‌భ స‌చివాల‌యం ఈ ఎన్నికను ప్రకటించింది.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎంపీలు ఇద్దరూ కృత‌జ్ఞత‌లు తెలిపారు.

ఎయిమ్స్ పాలకమండలిలోని రెండు స్థానాలకు లోక్ సభ నుంచి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు, వైసీపీ ఎంపీ గురుమూర్తి నామినేషన్లు వేశారు.

- Advertisement -

ఈ ముగ్గురూ నామినేషన్లు ఉపసహరించటంతో కేశినేని శివనాథ్, బాలశౌరి ఎన్నిక ఏకగ్రీవం అయింది.

నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అరవింద్, అనకాపల్లి వైసీపీ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి ఇప్పటి వరకూ మంగళగిరి ఎయిమ్య్ పాలకమండలి సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు 17వ లోక్ సభ పదవీకాలం ముగిసింది. 18వ లోక్‌సభ ఏర్పడిన నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు మళ్లీ ఎన్నిక నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement