కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండల పరిధిలో టీడీపీ నేతలపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గిరినాథ్ చౌదరి, కల్యాణ్ చౌదరిలపై వేరే వర్గం వారు దాడి చేశారు.
ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా గిరినాథ్ చౌదరి మృతి చెందాడు. కళ్యాణ్ చౌదరి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్నికల తర్వాత గ్రామాల్లో వర్గపోరు పెరిగింది.