ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దుండగులు దాడి చేశారు. కారులో ఇంటికి వెళ్తుండగా జీలుగుమిల్లి మండలం బర్రిలంకలపాడు సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కారు వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే, ఆ కారు వెనుకున్న మరో కారులో ఆయన ఉండటంతో ఎమ్మెల్యే బాలరాజు కు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఇక వెంటనే కారులో ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ముగ్గురు కిందకు దిగి దాడికి పాల్పడ్డ వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడి విషయాన్ని ఎమ్మెల్యే బాలరాజు వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.