అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెండో రోజూ శాసనసభలో ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
స్పీకర్ పోడియం వద్ద తెదేపా ఎమ్మెల్యేల నిరసనపై మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడారు. సభలో నిరసన తెలిపేందుకు కొన్ని విధానాలు ఉంటాయని బుగ్గన అన్నారు. అంబటి మాట్లాడుతూ సీఎం జగన్, పాలన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోబోమని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ అంశంపై చర్చ జరుగుతుందని.. అందులో తెదేపా ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు
అసెంబ్లీకి రెండో రోజూ పాదయాత్రగా వెళ్లిన తెదేపా ఎమ్మెల్యేలు.
తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెండో రోజూ అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నిరసన తెలుపుతూ తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు నడిచివెళ్లారు