Friday, November 22, 2024

AP Assembly ‘అవును..’ కాదు’.. ‘ఉత్పన్నం కాదు’ … ఈ సమాధానాలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

అధికారుల స‌మాధానాల‌పై ప‌వ‌న్ ఆగ్రహం
త‌ప్పు దోవ ప‌ట్టించ‌వ‌ద్దంటూ వార్నింగ్
స‌మాధానాలు అర్ధ‌మ‌య్యేలా ,వివ‌రంగా ఉండాలంటూ హిత‌వు
అధికారులు తీరు మారాలంటూ హెచ్చ‌రిక

అమరావతి: మంత్రులను మాయచేసేలా కొందరు అధికారులు సమాచారం ఇస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిలు అభిప్రాయపడ్డారు.. గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదంటూ అధికారులపై ఈ ఇద్ద‌రు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

శాసనసభ మూడోరోజు సమావేశాల్లో భాగంగా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారుల సరైన సమాచారం ఇవ్వలేదు. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపు విషయంలో అధికారులు ఇచ్చిన సమాచారంపై పవన్‌ కల్యాణ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాల్లేకుండా ‘అవును.. కాదు.. ఉత్పన్నం కాదు’ అనే రీతిలో అధికారులు సమాధానం ఇవ్వడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. పొడిపొడిగానే చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకు ఇచ్చే సమాధానంలోనే వివరాలు ఉండేలా చూడాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల మళ్లింపు విషయంలో అధికారుల సమాధానంపై డోలా అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకతవకలపై సరైన సమాచారం ఇవ్వలేదన్నారు. పూర్తిస్థాయిలో వివరాలు అందజేయాలని ఇవ్వాలని ఆదేశించారు.అదే స‌మ‌యంలో అధికారులు ప‌ని తీరు మార్చుకోవాల‌ని ప‌వ‌న్ కోరారు.. స‌మాధానాలు అంద‌రికి అర్ద‌మ‌య్యే విధంగా, స‌వివ‌రంగా ఉండాల‌ని సూచించారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement