Friday, November 15, 2024

AP Assembly – టీచర్లపై అక్రమ కేసులు ఎత్తివేస్తాం – నారా లోకేష్

త్వరలోనే మెగా డీఎస్సీని ప్ర‌క‌టిస్తాం
అభ్యర్థుల వ‌యోప‌రిమితి పెంచేందుకు చర్యలు
9వ తరగతి నుంచే ఇంటర్ ఓరియెంటేషన్
ఇంటర్ విద్యార్థులకు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు
స్కూళ్లల్లో ర్యాంకింగ్ మెకానిజం పెడ్తాం
అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రక‌ట‌న

ఆంధ్రప్రభ స్మార్ట్, వెలగపూడి :
వచ్చే విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. న్యాయపరంగా చిక్కులు లేకుండా ప్రయత్నిస్తున్నామన్నారు. శాసనసభలో ఆయన టీచ‌ర్ల నియామకాల‌పై స‌భ్యుల అడిగిన ప్రశ్నల‌కు స‌మాధానం చెబుతూ, గ‌త అయిదేళ్లలో ఉద్యోగ నియమకాలు సున్నా అని విమర్శించారు. డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేయలేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలో మొత్తంగా 15 సార్లు డీఎస్సీ నిర్వహించామని వెల్లడించారు. ప్రస్తుతం కూటమి సర్కార్ మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులకు వయో పరిమితిని పెంచేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్‌లో ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేస్తామని లోకేశ్ తెలిపారు. ఇదే స‌మ‌యంలో ఉపాధ్యాయులపై వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామన్నారు.

నారాయణ కాలేజీలకు పోటీగా…
ఏపీలో కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలను నడుపుతామని మంత్రి లోకేష్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, 20 నుంచి 30 కిలోమీటర్ల మధ్య డిగ్రీ కళాశాల ఉండాలనేది నిబంధన అని అన్నారు. ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్‌కు చాలా తేడా ఉంటుందని, గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్ధులకు టెక్ట్స్ బుక్స్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. టీచింగ్‌ను బలోపేతం చేసి విద్యార్ధులను ఎస్సెస్ చేసి కొందరికి ఫోకస్‌గా చదువు చెబుతున్నామన్నారు. ఈ ఏడాది10 శాతం అడ్మిషన్లు పెరిగాయన్నారు. నారాయణ కాలేజీలతో పోటీ పడేలా ఇంటర్ కాలేజీలు నడుపుతామని చెప్పారు. 9 వ తరగతి నుంచి ఇంటర్ కోసం ఓరియంటేషన్ ట్రైనింగ్ చేయాలని చెప్పారు. స్కూల్‌లకు ర్యాంకింగ్ మెకానిజం పెడదామని భావిస్తున్నామని, డిసెంబర్ మొదటి వారంలో పీటీఎం నిర్వహిస్తున్నామని.. సభ్యులు కూడా పాల్గొనాలని మంత్రి లోకేష్ అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement