‘‘వరుస తుపాన్లు ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడుతున్నాయి. చాలా జిల్లాలకు నీటి ముంపు ఉంది. గత శనివారమే నేను ఏరియల్ సర్వే చేశాను. కడప, చిత్తూరు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పరిస్థితులను స్వయంగా పరిశీలించాను’’ అని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ రోజు (శుక్రవారం) శాసనసభలో ఆయన వరదలు, సహాయక చర్యలపై మాట్లాడారు
‘‘నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని, శాశ్వతంగా కనుమరుగు అవుతానని ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు మాట్లాడారు.. ఆయన సంస్కారానికి నా నమస్కారం. నా సొంత జిల్లాపై నాకు మమకారం ఎక్కువే. కొంతమంది జిల్లాలకు వెళ్లకపోతే ఎలా అని అంటున్నారు. నేను వెళ్తే సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో వెళ్లడం లేదు..’’ అన్నారు సీఎం జగన్.