ఈనెల ఐదో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, ఈనెల 6వ తేదీన ఏపీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.