Friday, November 22, 2024

AP Assembly – ఎమ్మెల్యే గా జ‌గ‌న్ ప్ర‌మాణం ..

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారాయన. మంత్రులు ప్రమాణ స్వీకారం చేశాక వైఎస్ జగన్ ప్రమాణం చేశారు. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో కేవలం ఆ పార్టీ 11 సీట్లకే పరిమితమవ్వడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం విశేషం. కాగా, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు అసెంబ్లీ గేటు వెనుక నుంచి ప్రాంగణంలోకి జగన్ వచ్చారు. గతంలో సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా అసెంబ్లీకి వచ్చేశారు. ఆయ‌న కారును లోనికి వ‌చ్చేందుకు శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప‌య్యావులు అనుమ‌తించారు…

ముందుగా చంద్ర‌బాబు,ఆ త‌ర్వాత ప‌వ‌న్ …వ‌రుస‌గా మంత్రులు

ముందుగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆ తరువాత ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, కందుల దుర్గేశ్, ఎన్ ఎం డీ ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి, నారా లోకేశ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరి తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. వారి తర్వాత ఎమ్మెల్యేలు ఆంగ్ల అక్షరాల క్రమంలో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement