ఏపీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏపీలో వరుస తుపాన్లు.. అల్ప పీడనాలు.. భారీ వర్షాలు, వరదలను ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు సీఎం జగన్ మోహన్‌రెడ్డి. వరదలతో ఇబ్బందులు పడ్డ ప్రజలను తాము సత్వరమే ఆదుకున్నామని చెప్పారు సీఎం. గతంలో గల్లంతైన వారిని అస్సలే పట్టించుకోలేదని ఇంతకుముందున్న ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. తాము వెంటనే సహాయక చర్యలు చేపట్టామని, హెలీక్యాప్టర్లను పంపించి బాధితులను ఆదుకున్నామన్నారు సీఎం జగన్.
‘‘నిన్నటికే (గురువారం నాటికి) 4 జిల్లాల్లో విద్యుత్ పునరుద్ధరించాం’’ అని చెప్పారు ముఖ్యమంత్రి జగన్. ‘‘95,949 కుటుంబాలకు నిత్యావసరాలు అందించాం. 2వేల అదనపు సాయం కూడా చేశాం. ఇట్లాంటి పని చంద్రబాబు ఎప్పుడైనా చేశారా’’ అని ప్రశ్నించారు సీఎం. ‘‘గతంలో ఇంత వేంగాగా సాయం అందించారా.. అప్పట్లో నెల పట్టేది.. ఇప్పుడు వారంలో అందించాం. బియ్యం ఇస్తేనే ఎక్కువ అని ఫీలయ్యేరకం ఆయన.. అని చంద్రబాబుపై విమర్శలు సంధించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి