పాడేరు కాపీ తోట్లల్ని పట్టించుకోలేదు
ఆడవాళ్లపై అసభ్య పోస్టులు పెట్టటం నేర్పారు
ఎవరని నరకాలి, ఎవరిని చంపాలో నేర్పారు
9 ఐటీడీఏలను పని చేయనీయలేదు
అసెంబ్లీలో గిరిజన శాఖ మంత్రి సంధారాణి
ఆంధ్రప్రభ స్మార్ట్, వెలగపూడి:
గత అయిదేళ్లల్లో గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం ఎటువంటి శిక్షణ ఇవ్వలేదని, పాడేరులో కాఫీ తోటల పెంపకం వదిలి, గంజాయి పెంపకంలో గిరిజనులకు శిక్షణ ఇచ్చారని గిరిజనశాఖ మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. గిరిజనులకు శిక్షణ నిలిపి, మహిళలపై అత్యాచారాల, అక్రమ కేసులు పెట్టడం, భూ దురాక్రమణ లు, రౌడీయిజం లో తమ పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారని ఘాటుగా విమర్శించారు. గిరిజన యువత, విద్యార్థులకు శిక్షణ తీరుతెన్నూ, ప్రభుత్వ బకాయిలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గత అయిదేళ్లల్లో స్కిల్ డవలప్ మెంట్ శిక్షణలు కుంటుపడ్డాయన్నారు. 2019 నుంచి 23 వరకూ య సెట్ పథకంలో ఆదరణ, సున్నా , చేయూత పథకాలకే బటన్ నొక్కారని, యువతకు సిల్క్ డవలప్ మెంట్ శిక్షణ ఇవ్వలేదన్నారు.
అక్రమ కేసులపైనే శిక్షణ..
స్కిల్ డవలప్ కోర్సుల్లో నే బాకీలు ఉన్నాయని మంత్రి వివరించారు. రాష్ర్టంలో 9 ఐటీడీఏ పరిధుల్లో వైటీసీ యూత్ ట్రైనింగ్ సెంటర్లలో సిల్క్ డవలప్ మెంట్ కోర్సులో శిక్షణ క్రమేపీ నిలిపివేశారని మంత్రి వివరించారు. 2015..16లో 500 మందికి శిక్షణ ఇవ్వగా.. ఖర్చులు చెల్లించామని, 2019 నుంచి 23 వరకూ.. ట్రైనింగ్ క్లాసుల్లో యువత సంఖ్య తగ్గిపోయిందన్నారు. 2019..20 మధ్య 10,000 మందికి శిక్షణ ఇస్తే.. 2020..21 మధ్య 4000కు పడిపోయిందని, 2221..2022లో 3000 కు , 2022..23లో 1300కి పడిపోగా.. 2023..24లో ఈ కోర్సులే లేవన్నారు. మహిళలపై అసభ్యంగా పోస్టులు పెట్టటం, అక్రమ కేసులు పెట్టటంపైనే శిక్షణ సాగిందన్నారు. గంజాయి రవాణాలో పిల్లలకు శిక్షణ ఇచ్చారని, ఈ విషయాన్ని టెన్త్, ఇంటర్ పిల్లలే చెప్పారని మంత్రి వివరించారు. పాడేరులో కాపీ పెంపకాన్ని పక్కన పెట్టి గంజాయి రావాణాలో స్కిల్ డవలప్ చేశారని మంత్రి విమర్శించారు.
కోర్సుల నిర్వహణలో బాకీలు..
ఈ కోర్సుల నిర్వహణలో ఇప్పటికి రూ.5.70కోట్లు బకాయి ఉందని, పాడేరు ఐడీడీఏకి రూ.94 లక్షలు, చింతూరు ఐటీడీఏకి రూ.18లక్షలు, నెల్లూరు ఐటీడీఏకి రూ 18 లక్షలు, పార్వతీపురం ఐడీడీఏకు రూ.1.70 కోట్లు బకాయి ఉందని మంత్రి వివరించారు. అయిదేళ్లల్లో ఒక్క ఐటీడీఏ కూడా పని చేయలేదన్నారు. మళ్ళీ అన్ని ఐటీడీఏ ప్రాజెక్టుల పరిధిలో గిరిజన విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. మంత్రి సమాధానంపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు సంతృప్తి వ్యక్తం చేశారు.‘‘విష్ణు కుమార్ రాజు ఎంత విపులంగా ప్రశ్న అడిగారో మీరు అంతకంటే వివరంగా సమాధానం మంత్రి ఇచ్చారని’’ డిప్యూటీ స్పీకర్ పేర్కొన్నారు.