Saturday, September 7, 2024

AP Assembly – తొలి రోజు 172 మంది స‌భ్యుల ప్ర‌మాణ స్వీకారం

ఏపీ అసెంబ్లీ సెషన్ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ముందుగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయగా ఆ తరువాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరి తర్వాత మంత్రులు ఒక్కొక్కరిగా ప్రమాణాన్ని పూర్తి చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ప్రమాణం చేశారు. ఆ తరువాత ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా 172 మంది ఇవాళ ప్రమాణం చేయగా వ్యక్తిగత కారణాలతో ముగ్గురు సభ్యులు సభకు హాజరుకాలేకపోయారు.

హాజ‌రుకాని జీవీ ఆంజనేయులు, వనమాడి వెంకటేశ్వరరావు, పితాని సత్యనారాయణ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ప్రమాణం పూర్తి చేసిన ఎమ్మెల్యేలకు శాసనసభ వ్వవహారాల కార్యాలయం రూల్స్ బుక్, రాజ్యాంగ పుస్తకాలతో కూడిన కిట్ బ్యాగును అందజేసింది.

- Advertisement -


ఇదిలా ఉండగా అసెంబ్లీ స్పీకర్ పదవికి చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. అతని తరఫున కూటమి సభ్యులు నామినేషన్ దాఖలు చేయగా.. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.


రేపు సభ్యులందరి ప్రమాణం పూర్తయ్యాక స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. కాగా రేపు ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ ప్రారంభంకానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement