( ఆంధ్రప్రభ స్మార్ట్, వెలగపూడి) – ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్డార్.. ఊరుకునేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. డ్రగ్స్ వ్యతిరేకంగా పెద్దఎత్తున ర్యాలీ చేపడతాం. పిల్లలకు కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎవరైనా భూకబ్జాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నా” అని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ధ్యేయంతో ఎన్డీయే ప్రభుత్వం పని చేస్తోందని, గత ప్రభుత్వ పాలనలో …ఎంత తవ్వితే అన్ని అక్రమాలు బయటకు వస్తున్నాయి. అప్పులు, తప్పులు, శాపాలు, నేరాలు ఒకదాని వెంట మరొకటి వస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీలో బుధవారం రాష్ట్ర బడ్జెట్ పై మాట్లాడుతూ, ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో రాష్ట్రం ఒక వెంటి లేటర్ పై ఉంది. ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరా? అని ప్రశ్నించారు, కానీ నేను పారిపోను. పోరిపోలేను. ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేశారు. విధ్వంసం చేశారు. అందుకే ప్రజలు విజ్ఞతతో నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రజల కోసమే పని చేస్తాం, సంక్షేమం, అభివృద్ధి కోసం ఒక్కొక్క ఇటుక పేరుస్తున్నాం. ఒక్క రోజులో ఏ పని జరగదు. 162 రోజులు గడిచాయి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం, అని సీఎం చంద్రబాబు అన్నారు.
ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలూ గాడి తప్పాయి. అధికార యంత్రాంగం గాడి తప్పింది. వీటన్నిటినీ గాడిలో పెడుతున్నాం, అన్ని లెక్కలు తీస్తున్నాం, ఆధారాలు సేకరించాం, రూ.10లక్షల కోట్ల అప్పులు ఉనాయి. అయినా భయపడం అని సీఎం అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో ప్రజల జీవన ప్రణామాలు మెరుగు పరుస్తాం. టీడీపీతోనే సంక్షేమం ఆరంభమైంది. కూడు, గూడు, గుడ్డ అందించాలని రెండు రూపాయలకే కిలో బియ్యం పథకానికి టీడీపీ వ్యవప్థాపకులు ఎన్టీఆర్ పునాది వేస్తే దేశ వ్యాప్తంగా పుడ్ సెక్యూరిటీ అమలు జరుగుతోందన్నారు. పేదలకు పెన్షన్, రైతులకు రూ.50లకే హార్స్ పవర్ విద్యుత్తు పథకానికి 40 ఏళ్ల కిందటే టీటీడీ నాందీ పలికిందన్నారు. 2014లో 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తమ ప్రభుత్వం పని ప్రారంభిస్తే 120 సంక్షేమ పథకాలు ప్రారంభించాం. పించన్లు రూ.4వేలకు పెంచాం. 64 లక్షల మందికి పేదల భరోసా అందజేస్తున్నాం. వికలాంగులకు రూ.6వేలు, అనారోగ్య పీడితులకు రూ.10వేలు, రూ.15 వేలు ఇస్తున్నాం. హర్యానా రూ. 2500లు, తెలంగాణలో రూ. 2016లు ,తమిళనాడులో రూ. 1200లు, యూపీలో రూ. 1000లు చొప్పున పెన్షన్లు ఇస్తున్నారని సీఎం ఇవరించారు. , దేశంలో అతిపెద్ద ఈ సంక్షేమ పథకానికి రూ. 33000 కోట్లు భర్తిప్తున్నామని , ఆర్థిక పరిస్థితిని ఆధారం పేదల కోసం 198 అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, పాతవన్నీ మళ్లీ ప్రారంభిస్తామన్నారు.
ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ పెడతాం. ఇప్పటికే 101 అన్నా క్యాంటీన్ ను పని చేసున్నాయని, వాటి ద్వారా కోటీ 18 లక్షల మంది భోజనం చేశారని వివరించారు. విజయవాడ లో వరదలొస్తే బాధితులకు ఆదుకునేందుకు ప్రజలే ముందుకు రూ.500 కోట్లు విరాళం ఇచ్చారంటే.. అదీ ప్రభుత్వంపై విశ్వసనీయత అన్నారు. ఆడబిడ్డలకు దీపం 2లో ఉచితంగామూడు సిలిండర్లు ఇస్తాం. 49,40,000 మందికి ఉచిత సిలెండర్లు. రేషన్ కార్డు, ఆధార్ ఉంటే చాలన్నారు. రాష్ర్టంలో 83 లక్షల టన్నుల చెత్త పెరిగింది. అక్టోబర్ నాటికి పూర్తి గా చెత్త తీసే బాధ్యత చేపట్టాం. చెత్తను పన్ను రద్దు చేశాం అని సీఎం చంద్రబాబు అన్నారు.
మత్స్యకార కుటుంబాలను దెబ్బతీసేందుకు 217 జీవో తెచ్చారు. ఆ చెరువులో ఉపాది కల్పించేందుకు ఈ జీవోను రద్దు చేశామన్నారు. గీత కార్మికుల కులవృత్తికి ఆధారంగా 10 శాతం మద్యం షాపులు కేటాయించాం. అర్చకుల జీతాలు..రూ. 15 వేలకు నాయి బ్రాహ్మణుల జీతాలు కు రూ.25 వేలు పెంచామన్నారు. చేనేతకు జీఎస్టీ రద్దు చేశారు. ధాన్యం కొనుగోళ్లల్లో రూ.1640 కోట్లు బకాయి చెల్లించాం. రైతుల ధాన్యం కొనుగోలు.. రైతులు, 440 కోట్లు చెల్లించాం అన్నారు. .అభివృద్ధి చేస్తే ఆదాయం వస్తుంది. ఆదాయంతో సంపద పెరుగుతుంది. ఈ సంపదను ప్రజలకు పంచితే సంక్షేమం అమలు జరుగుతుందన్నారు..
దేశంలో పట్టణాల్లో ఎక్కువ జనం ఉంటారు.కానీ ఏపీలోని పట్టణాల్లో జనం తక్కువ మంది ఉన్నారు, ఏపీలోనే తక్కువ తలసరి ఆదాయం. ఈ స్థితిలో అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. కేంద్రం రూ.15000 కోట్లు ఇచ్చింది. . పోలవరం గేమ్ చేంజర్ ఆ విషయాన్ని చెబుతున్నా . నదుల అనుసంధానంతో అభివృద్ధి పురోగతి పడుతుంది, ఇప్పటికే రూ. 12,107 కోట్లు కేంద్రం మంజూరు చేసిందన్నారు. కేంద్ర ఇచ్చిన డబ్బులు దారి మళ్లించారు. రూ. 4500 మళ్లించారు. ఈ స్థితిలో రూ. 4500 చెల్లించి కేంద్రం నుంచి డబ్బులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. .. జల్ జవన్ మిషన్ 45 శాతం నిధులతో ఇతర రాష్ర్టాల్లో లక్షల కోట్లతో ఇంటికి ఇంటికి కుళాయి నీరు ఇస్తున్నారు. అమృత్ కింద మనం కూడా నీరు ఇస్తాం అన్నారు. రోడ్డు నాగరికతకు చిహ్నం. రైతు పండించే పంటను మార్కెట్కు పంపించే అవకాశం. గ్రామాల్లో విరక్తి కలుగుతోంది. 860 కోట్లు మంజూరు చేశాం. సంక్రాంతి నాటికి రోడ్ల గుంతలు పూడుస్తారని వివరించారు. ఏపీలో 10లక్షల ఎకరాల్లో సాగు కోసం ఎత్తిపోతల పథకాలు తీసుకువస్తే.. పోతూ పోతూ మోటార్లు అమ్ముకున్నారని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రస్తుతం 4 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వలేని స్థితి. పేదలపై భారం పడకూడదు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా రూ.1,20,000 కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులు చేపడుతున్నామని, మెగా డిఎస్సీతో 16, 347 ఉద్యోగాలు ఇస్తామన్నారు.
ప్రశ్నోత్తరాల్లో అయోమయం
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికారుల పనితీరుపై స్పీకర్ అయన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల విషయంలో సభలో అయోమయం నెలకొంది. ఒక శాఖ ప్రశ్నలు వేరే శాఖలకు చేరటంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయసభల్లో మంత్రికి ఒకే ప్రశ్న రావడంపైనా మండిపడ్డారు స్పీకర్. ఈ అయోమయానికి కారణం అధికారుల నిర్లక్షమే స్పీకర్ ఆగ్రహించారు. అధికారులు తమ శాఖకు వచ్చిన ప్రశ్నలను వేరే శాఖలకు ఎలా పంపుతారంటూ స్పీకర్ ప్రశ్నించారు. ఇళ్ళ స్థలాల, ఇళ్లు పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవెన్యూకు ఎలా వేస్తారని స్పీకర్ అడిగారు. అధికారులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల పనులు విషయంలో జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడుకు ప్రశ్న వెళ్లింది. ఇదే సమయంలో మండలిలో గాలేరు నగరి, హంద్రీనీవా అనుసంధాన ప్రాజెక్టుపై ప్రశ్న ఇచ్చారు. దీనిపైనా స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే మంత్రికి ఉభయసభల్లో ఎలా ప్రశ్న వేస్తారనే క్వశ్చన్ చేశారు. ఉభయ సభల్లో మంత్రికి ఒకే సమయంలో ప్రశ్న రావడంపై విస్మయం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుతో ప్రశ్నత్తరాల సమయంలో సభలో కాసేపు అయోమయ పరిస్థితి నెలకొంది.