Thursday, November 21, 2024

AP Assembly – కాంట్రాక్టు ఉద్యోగుల క్ర‌మ‌బద్దీక‌ర‌ణ‌, జిపిఎస్ బిల్లుల‌కు గ్రీన్ సిగ్న‌ల్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు కాంట్రాక్టు ఉద్యోగుల‌ను క్ర‌మ‌బద్దీక‌రించే బిల్లుకు ఆమోదముద్ర వేసింది.. అనంత‌రం జీపీఎస్ బిల్లును ఏపీ ప్రభుత్వం బుధవారంనాడు ప్రవేశ పెట్టింది. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.జీపీఎస్ అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాపై రూ. 2500 కోట్ల భారం పడే అవకాశం ఉందని మంత్రి చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిందన్నారు. 2014 నుండి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఆశా వర్కర్ల జీతాలను రూ. 10 వేలకు పెంచిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న సీపీఎస్ ను రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీపీఎస్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. సీపీఎస్ కు బదులుగా జీపీఎస్ ను తీసుకు వస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించంది. దానికి అనుగుణంగానే అసెంబ్లీలో బిల్లును ప్ర‌వేశ‌పెట్టామ‌న్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement