ఏపీ అసెంబ్లీలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు శాసనసభ ఆమోదం లభించింది. వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈరోజు అసెంబ్లీలో మంత్రి విడుదల రజనీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. మంత్రి సభలో మాట్లాడుతూ… ప్రతిపక్షంలో ఉన్నవారికి ఎన్టీఆర్ పేరు గుర్తోస్తోందని, అధికారం ఉంటే ఓ లాగా అధికారం లేకపోతే మరోలా చెబుతారన్నారు. 8 మెడికల్ కాలేజీలను వైఎస్సార్ 11కు చేశారని…దానిని జగన్ 28 మెడికల్ కాలేజీలకు చేర్చారని చెప్పుకొచ్చారు. అందుకే ఆ క్రెడిట్ మనం తీసుకోవాలనే .. వైఎస్ఆర్ పేరు పెట్టామని తెలిపారు.
ఎన్టీఆర్ మీద జగన్ కు గౌరవం ఉందని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
Advertisement
తాజా వార్తలు
Advertisement