Tuesday, November 26, 2024

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. కరోనా కారణంగా ఒక్కరోజే అసెంబ్లీ, మండలి సమావేశాలు జరిగాయి. ఇవాళ్టి సమావేశాల్లో ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. శాసన మండలిలో మంత్రి ధర్మాన కృష్ణదాసు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2021-22 బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లు. తొలిసారిగా జెండర్ బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ వార్షిక బడ్జెట్‌లో రూ.47 వేల 283 కోట్లు జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. చిన్నపిల్లలకు చైల్డ్ బడ్జెట్‌లో రూ.16,748.47 కోట్లు ప్రత్యేకంగా కేటాయింపులు చేశారు. బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు,నవరత్నాలకే ప్రభుత్వం పెద్దపీటను వేసింది. కాగా, అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించిన విషయం తెలిసిందే.

బడ్జెట్ వివరాలు:

  • 2021-22 రాష్ట్ర బడ్జెట్ అంచనా – రూ. 2,29,779.27 కోట్లు
  • రెవెన్యూ వ్యయం – రూ. 1,82,196 కోట్లు
  • మూలధన వ్యయం – రూ. 47,582 కోట్లు
  • రెవెన్యూ లోటు – రూ. 5 వేల కోట్లు (0.47 శాతం)
  • ద్రవ్య లోటు – రూ. 37,029.79 కోట్లు
  • జీఎస్డీపీలో ద్రవ్యలోటు – రూ. 3.49 శాతం  
  • నీటిపారుదల శాఖకు – రూ. 13,237.78 కోట్లు
Advertisement

తాజా వార్తలు

Advertisement