Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ AP – రాంకో కి అసైన్డ్ భూములు కేటాయించిన జ‌గ‌న్ – అధికారులకు హైకోర్టు నోటీసులు

AP – రాంకో కి అసైన్డ్ భూములు కేటాయించిన జ‌గ‌న్ – అధికారులకు హైకోర్టు నోటీసులు

0
AP – రాంకో కి అసైన్డ్ భూములు కేటాయించిన జ‌గ‌న్ – అధికారులకు హైకోర్టు నోటీసులు

అమ‌రావ‌తి – నిరుపేద‌ల‌కు చెందాల్సిన అసైన్డ్ భూములు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అక్రమంగా కార్పొరేట్ సంస్థ‌ల‌కు దారాద‌త్తం చేసిందంటూ నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలానికి చెందిన వంకదార చిన చెన్నప్ప హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై నేడు హైకోర్టులో వాద‌న‌లు జ‌రిగాయి.. పిటిష‌న‌ర్ తరుపున న్యాయ‌వాది శ్ర‌వ‌ణ్ కుమార్ త‌న వాద‌ల‌ను వినిపించారు..

ప్రభుత్వ భూమిని పేదలకు పంచాల‌న్న నేపంతో వందల కోట్ల విలువైన అసైన్డ్ భూమిని రాంకో సిమెంట్ పేరిట అధికారులు బదలాయించార‌ని వాదించారు. రాంకో సిమెంట్ పేరిట బదలాయించిన భూమి ఇప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ భూమి గానే నమోదయిందని వివ‌రించారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల లో ఉన్న మొత్తం 1926 ఏక‌రాల భూమిని పేదప్రజలకు అసైన్మెంట్ చేసి మరుక్షణమే రాంకో సిమెంట్ పేరిట రెవెన్యూ , రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు బ‌దాలాయించేశార‌ని కోర్టు దృష్టికి తెచ్చారు. త‌న వాదనను సమర్థిస్తూ 900 పేజీల ఆధారాలు హైకోర్టు సమర్పించారు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.

వేలాది అసైన్మెంట్ ఎకరాలు పేద ప్రజలను మోసం చేస్తూ కేటాయింపులు జరగకుండానే కార్పొరేట్ సంస్థలకు బదలాయించటం చట్ట విరుద్ధం అని అన్నారు.. కాగా, న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం తక్షణమే రామ్ కో సిమెంట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాల‌ని ఆదేశించింది. అలాగే ప్రిన్సిపల్ సెక్రెటరీ పంచాయతీరాజ్, రెవిన్యూ మరియు జిల్లా కలెక్టర్ ను కౌంటర్ దాఖలు చేయవలసిందిగా కోరింది.. త‌దుప‌రి విచార‌ణ‌ను మూడు వారాలు వాయిదా వేసింది.

Exit mobile version