అటువంటి వాళ్లను నమ్మోద్దన్న అశోక్ గజపతి రాజు
వైసిపి పాలనలోనే భ్రష్టు పట్టిన ఆలయాలు
విధ్వంస పాలనకు ఆయన జగన్ బ్రాండ్ అంబాసిడర్
విజయనగరం – ఇంట్లో ఓ మతం, ఇంటి బయట మరో మతం గురించి మాట్లాడే నాయకులు ఎవరైనా సరే వాళ్లని నమ్మొద్దని అన్నారు మాజీ కేంద్ర మంత్రి,టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతిరాజు..విజయనగరంలో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, రామతీర్థం విగ్రహ ధ్వంసం ఘటన గురించి ప్రస్తావిస్తూ.. విగ్రహాన్ని ధ్వంసం చేసి విధ్వంస పాలన చేశారని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం పునర్నిర్మాణం కోసం విరాళాలు ఇస్తే వాటిని తిరిగి వెనక్కి పంపించారని మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ రాష్ట్రంలోని దేవాలయాలను భ్రష్టు పట్టించిందని చెప్పారు.. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రసాదం కల్తీ జరిగిందని ఆయన ఆరోపించారు.