Wednesday, July 3, 2024

AP | ఏపీ టెట్‌ నోటిఫికేషన్… 4 నుంచి దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ జరగనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కోసం ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను cse.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని పాఠశాల విద్యాశాఖ అధికారులు సూచించారు.

వారంలో మెగా డీఎస్సీ… 

ఈ నెల‌ 3 నుంచి 16 వరకు దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఇక‌ 4 నుంచి 17 వరకు దరఖాస్తుల దరఖాస్తులు స్వీకరించనున్నారు. మ‌రోవైపు వారం రోజుల్లో మెగా డీఎస్సీకి సంబంధించి ప్రత్యేక ప్రకటన వెలువడనుంది. టెట్, డీఎస్సీ మధ్య 30 రోజులకు పైగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కాగా, వివిధ కేటగిరీల కింద 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. 

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement