Wednesday, December 25, 2024

AP – ఓబులాపురం మైనింగ్ కేసు – కోర్టుకు హాజ‌రైన ఎపి, తెలంగాణ నేత‌లు

విజ‌య‌వాడ – ఓబులాపురం మైనింగ్ కేసు విచార‌ణ‌కు ఎపి , తెలంగాణ‌కు చెందిన 18 మంది నేత‌లు ప్ర‌జా ప్ర‌తినిధులు నేడు కోర్టుకు హాజ‌ర‌య్యారు. కాగా 2007లో ఓబులాపురం మైనింగ్ పరిశీలనకు వెళ్లిన 21 మంది నేతలపై అక్క‌డి పోలీసులు వారిపై కేసు న‌మోదు చేశారు.. మొత్తం 21 మందిపై కేసు నమోదు అవగా.. వీరిలో ముగ్గురు మరణించారు. మిగిలిన వారిని తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలంటూ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

దీంతో విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం కోర్టుకు నేతలు హాజ‌ర‌య్యారు.. మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, దేవినేని ఉమా, నిమ్మకాయల చినరాజప్ప, ఎర్రబెల్లి దయాకర్, అమర్నాథ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు బాబు రాజేంద్రప్రసాద్, కోళ్ల లలిత కుమారి, పొలం నాగరాజు, చిన్నబాబు రమేష్, గురుమూర్తి త‌దిత‌రులు కోర్టుకు హాజ‌రైన వారిలో ఉన్నారు…

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement