Wednesday, November 6, 2024

AP – ఎపిలో శాప్ నెట్ మూత‌…

విద్యా శాఖ‌కు సిబ్బంది బ‌దిలీ
శాప్ నెట్ ద్వారా విద్యా విష‌యాలు ప్ర‌సారం
కొత్త నిర్ణ‌యంతో ఇక విద్యా శాఖ కు ఆ విధులు బ‌దిలీ

అమ‌రావ‌తి – ఏపీ ప్ర‌భుత్వం తాజాగా సొసైటీ ఫ‌ర్ ఏపీ నెట్‌వ‌ర్క్ (శాప్ నెట్‌)ను మూసివేసింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన ఆస్తులు, సిబ్బంది, అప్పుల‌ను ఉన్న‌త విద్యా మండ‌లికి బ‌ద‌లాయించింది. కాగా, 2018లో శాప్ నెట్‌ను అప్ప‌టి టీడీపీ స‌ర్కార్ ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా మ‌న టీవీ ద్వారా విద్యారంగానికి సేవ‌లు అందించింది. ఇప్పుడు ఈ విభాగాన్ని మూసివేసి, నేరుగా విద్యామండ‌లి నుంచే స‌మ‌ర్థ‌వంతంగా సేవ‌లందించాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇక విద్యా విష‌యాల ప్ర‌సారాలు విద్యా మండ‌లి చేప‌ట్ట‌నుంది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement