Wednesday, December 4, 2024

AP – కాకినాడ పోర్టు అక్ర‌మాల‌పై కేబినేట్ లో వాడీ వేడి చ‌ర్చ‌

క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న మంత్రులు
క‌మిటీ నివేదిక కోసం వేచి చూద్దామ‌న్న చంద్ర‌బాబు
10 అంశాల‌పై కేబినేట్ చ‌ర్చ‌
కొత్త క్రీడా పాల‌సీకి గ్రీన్ సిగ్న‌ల్
డిసెంబ‌ర్ 15న ఆత్పార్ప‌ణ దినం పాటించాల‌ని నిర్ణ‌యం

అమ‌రావ‌తి – కాకినాడ‌లో ఎగుమ‌తులు, దిగుమ‌తులు నిబంధ‌ల‌కు అనుగుణంగా జ‌రగాల‌ని ఎపి మంత్రి వ‌ర్గ స‌మావేశం నిర్ణ‌యించింది.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నేడు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినేట్ భేటీలో మొత్తం 10 అంశాల‌పై చ‌ర్చించారు. ముఖ్యంగా కాకినాడ పోర్ట్ లో రేష‌న్ ఎగుమ‌తుల‌పైనే గంట‌న్న‌ర పాటు చ‌ర్చ జ‌రిగింది.. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ ఇటీవ‌ల కాకినాడ‌లో ప‌ర్య‌టించి సేక‌రించిన వివ‌రాల‌పై కూడా మంత్రులు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు.. పేద‌ల‌కు అందాల్సిన బియ్యం అక్ర‌మం మార్గంలో మ‌రీ ముఖ్యంగా కాకినాడ పోర్ట్ నుంచి త‌ర‌లిపోవ‌డం ప‌ట్ల ప‌లువురు మంత్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక‌పై ఎగుమ‌తులు, దిగుమ‌తులు స‌జావుగా సాగేందుకు తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల గురించి చంద్ర‌బాబు మంత్రుల అభిప్రాయాల‌ను సేక‌రించారు.. పోర్టు అక్ర‌మాల‌పై ఇప్ప‌టికే వేసిన అయిదుగురు క‌మిటీ స‌భ్యుల నివేదిక వ‌చ్చిన త‌ర్వాత తదుప‌రి చ‌ర్య‌లు తీసుకుందామ‌ని కేబినేట్ ఏకాభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

కొత్త క్రీడా పాల‌సీకి గ్రీన్ సిగ్న‌ల్ .

- Advertisement -

ఐటీ అండ్ గ్లోబల్ కేపాసిటీ సెంటర్స్ పాలసీ 4.0 అంటే ఆర్‌టీజీని పునర్వ్యవస్థీకరించే అంశంపై వెర్షన్ 4.0 అమలుపై మంత్రి వర్గంలో చ‌ర్చించి ఆమోద ముద్ర వేశారు. అలాగే ఏపీ టెక్స్‌టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీ, ఏపీ మారిటైమ్ పాలసీ 4.0, ఏపీ టూరిజం పాలసీ, స్పోర్ట్స్ పాలసీలకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇప్పటికే ఒలంపిక్స్, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి ఇచ్చే ప్రోత్సకాలను పెంచుతూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఇక నూత‌న క్రీడా విధానానికి ఆమోద ముద్ర ల‌భించింది.

15న ఆత్మార్ప‌ణ దినం

అలాగే పొట్టి శ్రీరాములు వర్ధంతి డిసెంబర్ 15 ను ఆత్మార్పణ దినంగా రాష్ట్ర ఉత్సవంగా జరిపేందుకు కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ ఆక్ట్‌లో సవరణల బిల్లుకు కేబినెట్ ఓకే చెప్పింది. దీంతో పాటు 41 వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కూడా ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. ఈ నెల 15 నుంచి అమ‌రావ‌తిలో ప‌నులు ప్రారంభించాల‌ని కూడా నిర్ణ‌యించింది.
.

Advertisement

తాజా వార్తలు

Advertisement