అమరావతి: ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్-2లో దస్త్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కుమార్తె రష్మితతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు హోంమంత్రికి వేదాశీర్వచనం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం వివిధ శాఖల అధికారులు, నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు .
- Advertisement -