Thursday, November 7, 2024

Record | కూలీలకు ఉపాధి కల్పనలో ఏపీ, తెలంగాణ టాప్

జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్దేశిత లక్ష్యానికి మించి కూలీలకు పని దినాలు కల్పించడం ద్వారా దేశంలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వివరాలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తర్వాత స్థానాల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి.

ఏప్రిల్‌ నెలలో తెలంగాణలో ఉపాధి కూలీలకు 2.25 కోట్ల పనిదినాలు కల్పించాల్సి ఉండగా… 3.29 కోట్ల పని దినాలను కల్పించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. ఏప్రిల్‌ 1 నుంచి మే 15వ తేదీ వరకు తీసుకుంటే 4.49 కోట్ల పని దినాలను కల్పించినట్లు తెలిపింది. ఇదే కాలవ్యవధిలో ఏపీలో 6.99 కోట్ల పని దినాలను ఉపాధి కూలీలకు కల్పించినట్లు వెల్లడించింది.

2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణలో 8 కోట్ల పనిదినాలకు ఆమోదం ఉందని వివరించింది. ఇప్పటికే నాలుగున్నర కోట్ల పనిదినాలు పూర్తవటంతో ఏడాది మొత్తంలో అధికారులు ఇలాగే లక్ష్యానికి మించి పనులు కల్పిస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదంతా ఇదే తరహాలో అత్యధిక పనిదినాలు కల్పించాలని కూలీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement