ఆలయాలకు సంబంధించిన ప్రతి సెంటు భూమి కాపాడేలా చర్యలు తీసుకుంటామని,.. ఆక్రమణకు గురైన ప్రతి సెంటు భూమి తిరిగి దేవదాయ శాఖ ఇప్పించే విధంగా చర్యలు చేపడతామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. విజయవాడలోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో ఏపీ దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేటి నుంచి పూర్తిగా శాఖ పైన అన్ని రకాల చర్యలు, నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు..
ఇక, 3వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో తమ కార్యాలయంలో పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తాం అన్నారు మంత్రి ఆనం.. ధర్మాన్ని మనం కాపాడితే.. అదే మనల్ని, ప్రజల్ని కాపాడుతుందన్న ఆయన.. ఆలయాల నిర్వహణ పట్ల గతంలో అనేక కథనాలు వచ్చాయి. ప్రభుత్వం సరిచేసుకొని వెళ్లాలని, మొదటిసారి జరిగితే దాన్ని తప్ప రెండోసారి జరిగిన స్వయంకృత అపరాధం కింద పరిగణిస్తాం న్నారు. దేవాలయాల ప్రక్షాళన మొట్టమొదట తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ప్రారంభిస్తున్నామన్నారు.. తమ అభిప్రాయాలు ప్రజల ముందు ఉంచారు.. త్రిదండి చిన్న జీయర్ స్వామిని కలిసి సలహాలు ఇవ్వాలని కోరానన్నారు.. అందరూ పీఠాధిపతులు, మతాధిపతులను కలిసి వారి ఆశీస్సులు తీసుకొని వారి సూచనలు సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు.. 26 వేలకు పైగా ఆలయాలకు పాలకవర్గాలు, ఆస్తులు ఉన్నాయని, .. కానీ, దీపం పెట్టే పరిస్థితి లేదన్నారు. ధూప దీప నైవేధ్యం కోసం కార్యక్రమం తీసుకుంటామన్నారు.. భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసి.. అన్ని కార్యక్రమాలు సజావుగా నిర్వహిస్తాం అన్నారు.
దేవాలయాల అభివృద్ధి పునరుద్ధరణ వంటి విషయాలు పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన తరువాతే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు ఆనం రామనారాయణరెడ్డి.. ఆలయాల కమిటీ కాలపరిమితి ప్రకారం కొత్త వాటి నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు.. తిరుమల నుంచే ప్రక్షాళన చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఈవోగా శ్యామలరావును నియమించారని గుర్తు చేశారు .. అన్ని ఆలయాల్లో పవిత్రత నిలబడేలా, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హిందూ ధర్మాన్ని కాపాడటమే దేవాదాయశాఖ బాధ్యత అని, న్యాయస్థానం, చట్టపరిధిలో ఉన్న స్థల ఆక్రమణ విడుదలకు చర్యలు చేపడతామన్నారు. . ఆలయాలకు సంబంధించిన ప్రతి సెంటు భూమి కాపాడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన మరో ముగ్గురు మంత్రులు
ఇది ఇలా ఉంటే మరో మగ్గురు మంత్రుల కూడా నేడు బాద్యతలు స్వీకరించారు.. ఐటీ మంత్రిగా టీజీ భరత్ , రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ , బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితలు కూడా నేడు బాధ్యతలు చేపట్టారు.