Friday, November 22, 2024

AP – దేవుడి భూముల‌న్నీ అన్యాక్రాంతమే..

ఆంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి – భ‌గ‌వంతుని భూముల‌కు ర‌క్ష‌ణ‌గా ఉంటామ‌ని, మ‌న్యం భూముల‌ను కాపాడుకుంటామ‌ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి అన్నారు. ఆదివారం స‌చివాల‌యం బ్లాక్‌-2లోని తన చాంబర్‌లో దేవాదాయ శాఖకు సంబంధించిన పలు దస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భగవంతుని ఆస్తులకు రక్షకునిగా ఉండాలని నాకు ఈ బాధ్యత ఇచ్చారు.. గత ప్రభుత్వంలో తిరుమల నుంచి అరసవల్లి వరకు భూములు అన్యాక్రాంతం అయ్యాయి అని మంత్రి ఆనం చెప్పారు. ఇప్పుడు ఏ చిన్న సంఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

తిరుమ‌ల నుంచే ప్ర‌క్షాళ‌న..కాగా, సీఎం చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన చేప‌ట్టార‌ని మంత్రి ఆనం అన్నారు. ప్రజాగళం, యువగళంలో వచ్చిన వినతులను పరిష్కరిస్తామ‌ని, ₹50 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాల నిమిత్తం ₹10 వేలు ఇవ్వాలని నిర్ణయించిన‌ట్టు చెప్పారు. దీనికి సంబంధించి ₹32 కోట్లు అదనపు భారం దేవాదాయ శాఖపై పడుతుందన్నారు.

తప్పులు చేసిన వారిని వదిలేది లేదు.. నెల్లూరు జిల్లాలో రెండు ఆలయాల్లో తప్పులు జరిగినట్టు నిర్ధారించి అయిదుగురు అధికారులను సస్పెండ్ చేశామని వెల్లడించారు.ఆల‌యాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు చ‌ర్య‌లు..ఇక, దేవదాయ శాఖకు చెందిన ఓ అధికారిణిని సస్పెండ్ చేశామని మంత్రి ఆనం తెలిపారు. 160 దేవాలయాలను పునర్నిర్మాణం చేయబోతున్నాం.. 13 వెనుకబడిన ప్రాంతాలు ట్రైబల్ ఏరియాలో ఉన్న గుళ్లనూ పునర్నిర్మాణం చేయాలని ఆదేశించాం.. కృష్ణ , గోదావరి న‌దుల‌ వద్ద జలహారతి తిరిగి కొనసాగించనున్నట్టు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement