Friday, November 22, 2024

AP: బీరువాలో లక్షదాచిన వృద్ధుడు.. ఆ తర్వాతేమైందంటే..

బీరువాలో లక్షదాచిన వృద్ధుడు.. ఆ తర్వాతేమైందంటే..

నెల్లూరు: విధి ఆడే వింత నాట‌కంలో మనం ఓడిపోతూ ఉంటాం. అన్నీ బాగున్నాయనుకునేలోపే అంచనాలు తలక్రిందులవుతాయి. కష్టపడి సంపాదించిన‌ డబ్బు ఒక్కోసారి అక్కరకు రాకుండా పోతుంది. గుండె ఆపరేషన్ కోసం దాచిపెట్టుకున్న డబ్బులు చెదలు పట్టి నాశనం అయితే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది. నెల్లూరు జిల్లా వాకాడు బీసీ కాలనీ కి చెందిన షేక్ మహబూబ్ బాషాకి అలాంటి పరిస్థితి ఎదురైంది.

నాలుగు నెలలు క్రితం గుండె ఆపరేషన్ కోసం ఇంట్లో ఉన్న పాలిచ్చే బ‌ర్రెలను అమ్మ‌గా వచ్చిన లక్ష రూపాయలు స‌రిపోక‌పోవ‌డంతో మ‌రిన్ని డబ్బులు కోసం తిరుగుతున్నాడు. లక్ష రూపాయలు ఇంట్లోని బీరువాలో దాచుకున్నాడు. ఈ లోపు మిగిలిన డబ్బులు ఆపరేషన్ కోసం సమకూర్చుకున్నాడు.

ఆదివారం బీరువాలో దాచుకున్న లక్ష రూపాయలు డబ్బులు బయటకు తీయగా చెదలు పట్టి డబ్బులు చినిగిపోయాయి. ఆ సీన్ చూసిన వృద్ధుడికి షాక్ తగిలినట్టయింది. దీంతో మహబూబ్ బాషా లబోదిబోమంటున్నాడు.

చెదలు పట్టిన లక్ష రూపాయల్లో 500, 200, 100 నోట్లున్నాయి. తన కష్టం చెదలు తినేశాయని, తనను ఎవరు ఆదుకుంటారని కన్నీరుమున్నీర‌వుతున్నాడు. ఇంతకుముందు కృష్ణాజిల్లా మైలవరంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారి తాను కష్టపడి సంపాదించుకున్న ఐదు లక్షల రూపాయల కరెన్సీ నోట్లను ట్రంకు పెట్టెలో దాచుకోగా చెదలు తినేసిన ఘ‌ట‌న ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement