- స్వాగతం పలికిన కూటమి నేతలు
- సీఎం నివాసంలో విందు ఏర్పాటు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయవాడ గన్నవరం ఏర్పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు.. కూటమి నేతలు స్వాగతం పలికారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అమిత్ షా వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నివాసంలో జరిగే విందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పలువురు సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
చంద్రబాబు నివాసంలో విందు సమావేశం అనంతరం అమిత్ షా ఈ రాత్రి విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్నారు. రేపు (జనవరి 19న) ఏపీలో జరిగే ఎన్డీఆర్‌ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు అమిత్ షా హాజరుకానున్నారు.