Saturday, January 18, 2025

AP – నేడు విజ‌య‌వాడకు అమిత్ షా రాక‌…

వెల‌గ‌పూడి – కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. నేటి రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరానికి చేరుకుంటారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన రాత్రి విందులో అమిత్ షా పాల్గొంటారు.. ఈ విందులో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా పాల్గొన‌నున్నారు.. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారు.

ఇక రేపు ఉదయం ఎన్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తదితరులు పాల్గొంటారు. ప్రారంభోత్సవం తర్వాత అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement