అమరావతి – నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ రెండు రాష్ట్రాలకు సంబంధించినది. ఏపీకి ప్రాజెక్ట్‌లు అప్పగించబోమని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ..నదీజలాల పంపిణీని విభజన చట్టంలో పొందుపరిస్తే దానిని అంగీకరించబోమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మొండిగా వాదిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ వాటాలో ఒక్క నీటి బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్‌కి అవసరం లేదని స్పష్టం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణాకు 299 టీఎంసీల నీటిని కేటాయించిందన్నారు. కాగా, శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్లెట్లను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన సమావేశ మినిట్స్‌లో కేంద్ర జల్‌శక్తిశాఖ చాలా స్పష్టంగా పేర్కొన్నది. ఆపరేషనల్ ప్రొటోకాల్ ముసాయిదాలో చేసిన ప్రతిపాదనలతో తెలంగాణ 45 టీఎంసీల నికర జలాలను కోల్పోవాల్సిన ప్రమాదం ఏర్పడింది.