అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఈ నెల 22, 23 తేదీల్లో జరుగనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఈ జాతీయ సెమినార్ నిర్వహణ భాగస్వామిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సమ్మిట్ నిర్వహణకు రూ.5.54 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని పేర్కొంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు.
వ్యవసాయం, వైద్యారోగ్యం, అర్బన్ ప్లానింగ్, శాంతి భద్రతలు, వస్తుత్పత్తి రంగాల్లో డ్రోన్ల వినియోగం విధాన రూపకల్పనపై అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 దృష్టి పెట్టనుంది.
వాణిజ్యపరంగా డ్రోన్ల వినియోగం పెంచడం లక్ష్యంగా కాన్ఫరెన్సు జరగనుంది. డ్రోన్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన రోడ్ మ్యాప్ రూపకల్పన చేయనున్నారు. అక్టోబరు 22, 23 తేదీల్లో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ అమరావతి డ్రోన్ సమ్మిట్ నిర్వహించనుంది.