Friday, November 22, 2024

AP బ‌డ్జెట్ భేటీకి అంతా రెడీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, విజ‌య‌వాడ‌:ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. అదే రోజు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక పద్దుతో పాటు పలు కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేసింది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే ప్రవేశపెట్టిన సర్కార్.. ఇక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది.

కీల‌క బిల్లుల ఆమోదం..

తాజాగా ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. నవంబర్ 11వ తేదీన లేదా మరునాడు వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ సారి అసెంబ్లీ సమావేశాలు పది రోజులకుపైగా జరిగే చాన్స్‌ ఉంది. ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడంతో పాటు కీలక బిల్లులు సభ ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంది.

ఇప్పటివరకూ ఉన్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ నవంబర్ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ క్రమంలోనే పూర్తిస్థాయి బడ్జెట్ కు సర్కార్ సిద్ధమైంది.ఆర్థిక స్థితికి అనుగుణంగానే..నిజానికి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.

- Advertisement -

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు వెళుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు గడువు తీసుకోవాల్సి వచ్చిందని వివరించాయి. అందుకు అనుగుణంగానే రెండోసారి కూడా ఏపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది.

.6న కేబినెట్ సమావేశం..అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నేపథ్యంలో 6వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ కాబోతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు స‌మావేశం కానున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశాల నిర్వహణతో పాటు బడ్జెట్ పై లోతుగా చర్చించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా.. సభ ముందుకు తీసుకురావాల్సిన అంశాలపై కూడా చర్చ జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement