ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనులతో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు, దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 27 నుంచి జూన్ 23 వరకు విజయవాడ-బిట్రగుంట మధ్య నడిచే రైళ్లు (07977/07978) రద్దు చేశారు.
ఈ నెల 27 నుంచి 31 వరకు.. జూన్ 3 నుంచి 7 వరకు.. జూన్ 10 నుంచి 14 వరకు.. జూన్ 17 నుంచి జూన్ 21 వరకు బిట్రగుంట-చెన్నై సెంట్రల్ రైళ్లు (17237/17238) రద్దయ్యాయి. గుంటూరు-రాయగడ (17243/17244) రైళ్లను ఈ నెల 27 నుంచి జూన్ 24 వరకు రద్దు చేశారు. కాకినాడ పోర్ట్, విశాఖపట్నం మధ్య నడిచే (17267/17268) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు అధికారులు.
మచిలీపట్నం-విజయవాడ (07896), విజయవాడ-మచిలీపట్నం (07769), విజయవాడ-మచిలీపట్నం (07866), మచిలీపట్నం-విజయవాడ (07770), మచిలీపట్నం-విజయవాడ (07870), విజయవాడ-నర్సపూర్ (07861), నర్సపూర్-విజయవాడ (07863), విజయవాడ-భీమవరం జంక్షన్ (07283) రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఈ రైళ్లు విజయవాడ, రామవరప్పాడు మధ్య ఈనెల 27వ తేదీ నుంచి జూన్ 23 వరకు రద్దయ్యాయి.
తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్..
ఇక, తమిళనాడు వైపు నుంచి తిరుపతికి వచ్చే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. తిరుపతి-కాట్పాడి స్టేషన్ల మధ్య రోజూ నడిచే స్పెషల్ ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.
కాట్పాడి-తిరుపతిల మధ్య రాకపోకలు రద్దు చేశారు. బెంగళూరు-తిరుపతి ఎక్స్ప్రెస్, కోయంబత్తూరు-తిరుపతి, విల్లుపురం-తిరుపతి మద్య రాకపోకలు సాగిస్తున్న ఎక్స్ప్రెస్లు కూడా రద్దయ్యాయి. తిరుపతి రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.. ఈ కారణంగానే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.