మంగళగిరి రోడ్డుపై బైఠాయింపు
జనసేనాని చూసేంతవరకు కదలనని మొంకిపట్టు
ప్రజలపై త్రిశూలంతో దాడులు
నడిరోడ్డుపై వీరంగం…
బలవంతంగా ఆఘోర తరలించిన పోలీసులు
ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ: మంగళగిరిలో మహిళా అఘోరి హల్ చల్ చేసింది. జనసేన ఆఫీసు సమీపంలో హైవేపై బైఠాయించి పవన్ కల్యాణ్ ను కలిసేదాకా కదలనని తేల్చిచెప్పింది. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఆమెను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులపై అఘోరి చేయిచేసుకుంది. ఆమె రోడ్డు పై బైఠాయించడంతో ట్రాపిక్ భారీగా నిలిచిపోయింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమెను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు.. దీంతో మరింత రెచ్చిపోయి పోలీసులపై దాడికి దిగింది.. ఊగిపోతు వీరంగం సృష్టించింది.. స్థానిక ప్రజలపై కూడా దాడి చేసింది.. అతికష్టం మీద పోలీసులు అమెను అక్కడ నుంచి తరలించారు..
లేడి అఘోరీ నా లేక . రౌడీ లేడి నా అంటూ స్థానికులు మండిపడుతున్నారు. .రోజు రోజు కి అఘోరీ వింత చేష్టలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..ఇలా రోడ్ల మీదకి బట్టలు లేకుండా వచ్చి హల్చల్ చేయడం ఏమిటని కన్నెర్రె చేస్తున్నారు. అఘోరీ లు ఎవరూ కూడా ఇలాంటి రౌడీ ప్రవర్తన చేయరు అంటున్నారు.. ..హిందూ మతం మీద మచ్చ తెచ్చేలా ఈ అఘోర ప్రవర్తన ఉందంటూ ఆగ్రహిస్తున్నారు.
అంతకుముందు మంగళగిరిలోని ఓ కార్ వాష్ సెంటర్ లో అఘోరి తన కారును శుభ్రం చేయించుకుంది. ఆ సమయంలో అక్కడున్న ఓ జర్నలిస్టు తన మొబైల్ కెమెరాలో అఘోరిని వీడియో తీశాడు. ఇది చూసి అఘోరి మండిపడింది. ఆ జర్నలిస్టుపై త్రిశూలంతో దాడి చేసింది. అడ్డు వచ్చిన వారిపైనా దాడి చేసింది.