అధికారుల అవినీతిపై కంప్లెయింట్ చేయడానికి ఏపీ ప్రభుత్వం కొత్తగా మొబైల్ యాప్‌ను రూపొందించింది. ‘ఏసీబీ 14400’ పేరిట అవినీతి నిరోధక శాఖ రూపొందించిన ఈ మొబైల్ యాప్‌ను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవ్వాల (బుధవారం) లాంఛనంగా ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో నిర్వహించిన స్పందనపై సమీక్షలో భాగంగా సీఎం ఈ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. అధికారులు లంచం అడిగితే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఈ యాప్ ద్వారా ఫిర్యాదును ఆడియో రూపంలోనే కాకుండా వీడియో రూపంలో కూడా పంపవచ్చని వెల్లడించారు. ఇలా వచ్చిన ఫిర్యాదులను అవినీతి నిరోధక శాఖ నేరుగా సీఎం ఆఫీసుకు (సీఎంవో) నివేదిస్తుందన్నారు. అవినీతి నిరోధంలో ప్రతి కలెక్టర్‌తో పాటు ఆయా జిల్లాల ఎస్పీలకు కూడా పూర్తి బాధ్యత ఉంటుందని సీఎం జగన్ చెప్పారు.