Monday, November 18, 2024

AP – వరద బాధితులకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోటీ విరాళం

(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో)ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాద్ ఎన్నికయ్యారు. గత కార్యవర్గం మూకమ్మడిగా రాజీనామాలు చేసిన నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన ఏసిఏ నూతన కమిటీ ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ వ్యవహరించారు. ఏ సి ఏ నూతన పాలకవర్గానికి ఎంపీ కేసినేని చిన్ని అధ్యక్షుడిగా, బోర్డులోనే ఇతర పదవులకు సంబంధించి పానెల్ సభ్యుల ఎన్నికను నిర్వహించారు.

అయితే ఏసీఏకు నామినేషన్ల కు సంబంధించి ఎంపీ కేసునేని శివనాద్ ప్యానల్ తప్పా, ఇంకెవరు పోటీకి ముందుకు రాలేదు. దీంతో ఏసీఏ నూతన అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ ఆదివారం ప్రకటించారు. అలాగే ఏసీఏ ప్యానల్ కు సంబంధించి కేశినేని శివనాద్ ప్యానల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.

ఏసీఏ ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా ఎస్ సతీష్ ఎన్నికయ్యారు. ఏసీఏ జాయింట్ సెక్రటరీగా బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎన్నిక కాగా కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్లుగా విష్ణు తేజ లు ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు.

- Advertisement -

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల క్రికెట్ క్రీడాకారులు, అభిమానుల నుండి పెద్ద ఎత్తున ప్రశంసలు, అభినందనలు కేశినేని శివనాద్ ప్యానల్ కు వెల్లువెత్తుతున్నాయి….

అన్ని ప్రాంతాలలో క్రికెట్ కు వసతులు కల్పిస్తాం…..

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో క్రికెట్ కోసం అవసరమైన వసతులన్నీ కల్పిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు కేశినేని శివనాద్ ప్రకటించారు. ఏ సి ఏ నూతన కార్యవర్గం ఎన్నికైన నేపథ్యంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఏసీఏ తొలి నిర్ణయం గా కోటి రూపాయల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందించనున్నట్లు ప్రకటించారు.

వరద తాకిడికి బాధితులుగా మిగిలిన వారి సహాయార్థం ఏసీఏ తరపున కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. ఏసీఏ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం శుభ పరిణామం అన్న ఆయన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించే దిశగా కృషి చేస్తామన్నారు.

ఇప్పటి వరకు ఏపీలో కేవలం విశాఖపట్నంలోనే అంతర్జాతీయ మ్యాచుకులకు వేదికగా ఉండేదని, అయితే మంగళగిరి, కడపలో కూడా అంతర్జాతీయ మ్యాచులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రీడాకారులు అందరికీ న్యాయం జరిగేలా చూస్తూ అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసే విధంగా ఏసీఏ పని చేస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement