Monday, November 18, 2024

AP – రివ‌ర్స్ టెండ‌రింగ్ కు మంగ‌ళం…. ఎపి కేబినెట్ నిర్ణ‌యం

చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఈ కేబినేట్ మీటింగ్
సాగునీటి సంఘాల‌కు ఎన్నిక‌లు
పాస్ పుస్త‌కాల‌పై జ‌గ‌న్ ఫోటోలు తొల‌గింపు
వివాద భూముల రిజిస్ట్రేష‌న్ నిలిపివేత‌
కొత్త ఎక్సైజ్ విధానానికి ఆమోద ముద్ర

అమ‌రావ‌తి – గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రివ‌ర్స్ టెండ‌రింగ్ పాల‌సీకి స్వ‌స్తి ప‌లికింది చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. ఈ మేర‌కు నేడు అమ‌రావ‌తి స‌చివాల‌యంలో జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో ఆమోద‌ముద్ర వేశారు. ఈ స‌మావేశంలో మంత్రివ‌ర్గం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. . పాత‌న ప‌ద్ధ‌తిలోనే టెండ‌రింగ్ కొన‌సాగేలా క్యాబినెట్ ఆమోదించింది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులంతా హాజరైన ఈ సమావేశంలో పలు అంశాలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ర‌ద్దు

- Advertisement -

అలాగే స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ను ర‌ద్దు చేసింది. ప‌ట్టాదారు పాసు పుస్తకాల‌పై జ‌గ‌న్ ఫొటో తొలగింపుతో పాటు సాగునీటి సంఘాల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వివాదాల్లోని భూముల రిజిస్ట్రేష‌న్ నిలిపివేత‌కు ఆమోదించింది.

కొత్త ఎక్సైజ్ పాల‌సీ ఆమోదం
ఆబ్కారీ శాఖ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు ఆమోదం తెలిపింది. అలాగే పోల‌వ‌రం ఎడ‌మ కాలువ ప‌నుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు క్యాబినెట్ ఆమోదించడంతో పాటు ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న గుత్తేదారు సంస్థ‌నే కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించింది.

ప‌దేళ్ల త‌ర్వాత ఈ కేబినెట్ ..

కాగా, . దాదాపు పదేళ్ల తర్వాత పేపర్ లెస్ కేబినెట్ భేటీ నిర్వహించారు. 2014-19 కాలంలో టీడీపీ హయాంలో ఈ-కేబినెట్ భేటీ జరిగింది. ఆ తర్వాతి ప్రభుత్వం పేపర్ తో కూడిన కేబినెట్ సమావేశాలు నిర్వహించింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం కొలువుదీరగా.. ఈ-కేబినెట్ విధానాన్ని పునరుద్ధరించింది. .

Advertisement

తాజా వార్తలు

Advertisement