Badvel: బద్వేల్ ఉపఎన్నిక కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె. విజయానంద్. పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందన్నారు. మూడు చోట్ల ఈవీఎంలు పని చేయకపోవడాన్ని గుర్తించి వెంటనే వాటిని మార్చినట్టు చెప్పారు.
స్థానికంగా ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే రాజకీయ నాయకులు వాటిని అధికారుల దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె. విజయానంద్ తెలిపారు. ఓటింగ్ ప్రక్రియను 24మంది అధికారులు పరిశీలిస్తున్నారని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదన్నారు.
కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 35.47 శాతం పోలింగ్ నమోదయినట్టు అధికారులు తెలిపారు. బిఎస్ఎఫ్ కమాండెంట్ జి బి ఎస్ బాటి పోరుమామిళ్ల తాసిల్దార్ కార్యాలయం లోని ఎన్నికల బూతుల లో పోలీసులకు సూచనలు ఇచ్చారు.