Monday, January 20, 2025

AP – భారీగా ‘ ఐ ఎ ఎస్ ‘ ల బదిలీ

అమరావతి: ఏపీ ప్రభుత్వం భారీగా ఐఏఎస్లకు పోస్టింగ్లు, బదిలీ ప్రక్రియ చేపట్టింది. 25 మంది ఐఏఎస్లకు పోస్టింగ్లు, బదిలీలు చేస్తూ సీఎస్విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

సీఆర్డీఏ కమిషనర్గా కన్నబాబు, సీఎం ఎక్స్అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్ నియమితులయ్యారు. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ జైన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బి. రాజశేఖర్, జీవీఎంసీ కమిషనర్గా సంపత్ కుమార్నియమితులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement