Thursday, September 5, 2024

AP – మదనపల్లిలో పోలీసుల దూకుడు – కీలక సూత్రధారుల కోసం అన్వేషణ

( ఆంధ్రప్రభ స్మార్ట్, మదనపల్లి ప్రతినిధి ) మదనపల్లి పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో అనుమానస్పద అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. గతంలో ఇక్కడ పని చేసిన ఆర్డీవో ఎంఎస్ మురళి,ప్రస్తుతం బదిలీపై వెళ్లిన హరి ప్రసాద్, ఉద్యోగి గౌతమ్ తేజను సీఐడీ చీఫ్ రవి శంకర్ అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొంత మంది అనుమానిత అధికారులనూ మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈఘటన ఓ కుట్రగానే అధికారులు భావించి దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

ఈ కుట్ర వెనక అధికారులు, నాయకులు హస్తం తేల్చేపనిలో పడ్డారు.. మదనపల్లి పట్టణంలోని వైసీపీ పార్టీకి చెందిన ఓ రైస్ మిల్లర్ మాధవరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు.. ఇంట్లోకి వెళ్లిన పోలీసులకు ఆశా భంగం తప్పలేదు. మాధవరెడ్డి ఈఘటన జరిగిన రోజు నుంచి ఇంట్లో లేడని పోలీసుల విచారణలో వెల్లడయింది..దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. ఈ ఘటన వెనక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీ గా పేరు పొందిన రైస్ మిల్ మాధవరెడ్డి హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.. పరారీలోని రైస్ మిల్ యజమాని మాధవరెడ్డి కోసం పోలీసు వర్గాలు గాలిస్తున్నారు.. మరోవైపు ఈఘటన గురించి సీఐ, డీఎస్పీ ప్రసాద్ రెడ్డికి , ఎస్పీకి సమాచారం ఇవ్వక పోవటంపైనా అనుమానం వ్యక్తం చేస్తూ సీఐడీ బృందం విచారిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement