బాధ్యతలు స్వీకరించిన కొత్త బాస్
వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న
ఫిర్యాదులతో డీజీపీ రాజేంద్రనాధ్ తొలగింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంచార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ బాధ్యతలు స్వీకరించారు. అధికార వైసీపీకి అనుకూలంగా రాజేంద్రనాథ్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దాంతో వెంటనే ఆయన్ను పదవి నుంచి ఎన్నికల సంఘం తొలగించింది. కొత్త డీజీపీని నియమించే వరకు శంఖబ్రత ఇంచార్జీ డీజీపీగా విధులు నిర్వహిస్తారు.
రాజేంద్రనాథ్ రెడ్డి అధికార వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఆయనను ఆదివారం పదవి నుంచి ఎన్నికల సంఘం తొలగించింది. డీజీపీ పదవి కోసం అధికారుల పేర్లను పంపించాలని కోరింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారకా తిరుమల రావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్త అనే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ పేర్లను పంపించింది. కొత్త డీజీపీ ఎవరనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి నేడో , రేపో ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు రాష్ట్రంలో ఇంచార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ పదవిలో ఉంటారు. శంఖబ్రత గతంలో కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేశారు. శాంతి భద్రతల నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్నారు.