Tuesday, November 26, 2024

AP: ప‌లువురు క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌కు పోస్టింగులు

అమరావతి: ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోన్న అంశంపై కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఇటీవల ఈసీ బదిలీ వేటు వేసింది. ముగ్గురు ఐఏఎస్ ల‌తో పాటు, ఆరుగురు ఐపీఎస్ ల‌ను బదిలీ చేసింది. వీరిలో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఉన్నారు. వీరి స్థానంలో కొత్తగా నియామకాలు చేపట్టింది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన అధికారులు ఈరోజు రాత్రి 8గంటల్లోగా ఛార్జ్ తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

కొత్తగా నియమితులైన ఉన్నతాధికారులు వీరే..
కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, అనంతపురం కలెక్టర్ వి.వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్ గా ప్రవీణ్ కుమార్, గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్, పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు. అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరీఫ్ హఫీజ్ లకు పోస్టింగులిచ్చింది.

కృష్ణా జిల్లా నూతన కలెక్టర్ గా రాబోతున్న డీకే బాలాజీ
ప్రభుత్వ పాఠశాల విద్యార్థిగా కొనసాగుతూ.. సివిల్ సర్వీస్ లో 36వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అధికారిగా ఎంపికైన ఘనత బాలాజీ ది. 2020 కర్నూలు మున్సిపల్ కమిషనర్ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement