Saturday, December 21, 2024

AP ప‌వ‌న్‌కు చెబితే .. ప‌నైపోయింది

అర‌గంట‌లోనే స‌మ‌స్యకు ప‌రిష్కారం
ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌కు పీహెచ్‌సీ వైద్యుల విన‌తి
ఆటంకంగా ఉన్న జీవో 85 తొల‌గించాల‌ని రిక్వెస్ట్‌
జీవో స‌మ‌స్య‌పై వైద్య ఆర్యోగ్య శాఖ మంత్రికి ప‌వ‌న్‌ సూచ‌న
వెంట‌నే సాల్వ్ చేయాల‌నిహెల్త్ సెక్రెట‌రీకి ఆదేశాలు
పీహెచ్ డాక్ట‌ర్ల సంఘంతో మంత్రి, సెక్రెట‌రీ చ‌ర్చ‌లు
జీవో 85 ర‌ద్దు.. పాత విధానంలోనే పీజీ కోటాలో ప్ర‌వేశాలు
చిన్న స‌వ‌ర‌ణ‌తో పీజీలో చేరేందుకు తొల‌గిన అడ్డంకులు
ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌కు థ్యాంక్స్ చెప్పిన డాక్ట‌ర్ల బృందం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, అమ‌రావ‌తి :
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంట‌ర్స్‌లో ఉన్న వైద్యులకు పీజీలో ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించి జీవో 85 ప్రకారం రావాల్సిన సీట్లు దక్కడం లేదని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌కు ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధ‌వారం సాయంత్రం మొర‌పెట్టుకున్నారు. గతంలో మూడేళ్ల సర్వీసు ఉంటే సీటుకు అర్హత ఇచ్చేవారని, ఇప్పుడు ఐదేళ్లు చేయడంతో పాటు ఇన్ సర్వీస్ కోటాలో సీట్ల శాతాన్ని తగ్గించారని వివరించారు. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కొన్ని రోజులుగా తాము స‌మ్మె చేస్తున్నా వైద్య శాఖ‌లో ఎటువంటి స్పంద‌నా లేద‌న్నారు. దీనిపై స్పందించిన ప‌వ‌న్ వారు ప్ర‌స్తావించిన అంశాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. వెంట‌నే వారి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

- Advertisement -

ఉప ముఖ్య‌మంత్రి ఆదేశాలు.. వైద్య శాఖ మంత్రి చ‌ర్చ‌లు..

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ ఆదేశాల‌తో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళగిరి ఏపీఐఐసీ టవర్స్‌లో బుధవారం రాత్రి పీహెచ్‌సీ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో చర్చలు జ‌రిపారు. మంత్రితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కమిషనర్ హరికిరణ్‌, డీహెచ్ డాక్టర్ పద్మావతి, డీఎంఈ డాక్టర్ నరసింహం, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి పాల్గొన్నారు. వారి స‌మస్య‌ల‌ను విన్న మంత్రి క్ష‌ణాల్లోనే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.. చర్చల అనంతరం మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. అన్ని బ్రాంచ్‌లలో 20 శాతం రిజర్వేషన్ పెంచడంతో 258 సీట్లు పొందే అవకాశం ఉంటుంద‌న్నారు. పీజీ ఇన్ సర్వీసులో జాయిన్ కాకముందు ఏ బ్రాంచ్ లో డిప్లమా చదివితే అదే బ్రాంచ్‌లో పీజీ చేయాలన్న జీవో 85లోని నిబంధనను సడలిస్తామని, దీంతో ఏ బ్రంచ్ లోనైనా పీజీ చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. అలాగే సర్వీసులోకి రాకముందు పీజీ చేసి ఉంటే ఇన్ సర్వీసులో రెండో పీజీ చేసేందుకు అర్హత లేదన్న నిబంధనను కూడా సడలించి సొంత ఖర్చులతో పీజీ చేసేలా జీవోను సవరిస్తామని మంత్రి పేర్కొన్నారు.

స‌మ్మె వీడి విధుల్లో చేరిన‌ డాక్ట‌ర్స్‌..

ట్రైబల్ అలవెన్స్‌, నోషనల్ ఇంక్రిమెంట్‌(2020 బ్యాచ్‌కు ) ఇచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చామన్నారు. పీహెచ్‌సీ డాక్టర్ల డిమాండ్ల పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున సమ్మె విరమించి పేదల‌ ఆరోగ్య సంరక్షణ కోసం తక్షణమే విధుల్లోకి చేరాలని కోరారు. అందుకు డాక్ట‌ర్లు అంగీక‌రించారు.. అలాగే స‌మ‌స్య ప‌రిష్కారంలో వెంట‌నే స్పందించిన ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement